అసురన్ కన్నడ రీమేక్ లో స్టార్ హీరో..

తమిళం లో ధనుష్ నటించిన అసురన్ చిత్రం ప్రస్తుతం ఇతర భాషల్లో రీమేక్ అవుతుంది. ఇప్పటికే తెలుగు లో నారప్ప పేరుతో తెరకెక్కతుంది.వెంకీమామ తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్..సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో నారప్ప తెరకెక్కుతుంది. ఈ సినిమాను వి క్రియేషన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి యస్‌ థానులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అసురన్ కు రీమేక్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం కన్నడలో కూడా రీమేక్ అవ్వనుంది. కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్ ఈ రీమేక్ లో నటించబోతున్నారు. జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన వెట్రిమారన్ కన్నడ వెర్షన్ నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నారు. మరి ఈ సినిమా కన్నడ లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.