బీహార్ కు మాత్రనే కరోనా టీకానా?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే బిహార్ వాసులందరికి ఉచితంగా కరోనా వైరస్‌ టీకా అందజేస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా భాజపా ఎన్నికల వరాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన విరుచుకుపడింది. భాజపా ‘చెత్త, దిగజారుడు’ రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ అధికార పత్రిక సామ్నాలో తీవ్రంగా మండిపడింది.

బిహార్‌కు టీకా అందాలి. మిగతా రాష్ట్రాల సంగతేంటి. ఈ దేశంలోని మిగతా రాష్ట్రాలేమీ పాకిస్థాన్‌ కాదు. కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు. బిహార్‌కు మాత్రమే కాదు, ఓటు వేసిన వారందరికీ టీకాకు సంబంధించి సమాన హక్కులు ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేసింది.