శృతిహాసన్ కొత్త బిజినెస్

హీరోయిన్ శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్. ఆమె మంచి నటి, డ్యాన్సర్, సింగర్ కూడా. గతంలోనే కొన్ని ఆల్బమ్స్ కూడా చేసింది. కొన్ని మ్యూజిక్ షోలలో కూడా పాల్గొంది. సంగీతం అన్నది తన చిన్నప్పటి నుంచి తనలో వున్న అభిరుచి కావడంతో దాన్ని ఆమె వదలడం లేదు. అందుకే, కథానాయికగా బిజీగా ఉన్నప్పటికీ సంగీతం మీద కూడా దృష్టి పెడుతోంది.

ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెన్ లో ప్రారంభించబోతుంది శృతిహాసన్. ఈ ఛానెల్ ద్వారా తన కొత్త ఆల్బమ్స్ మ్యూజిక్ షోస్, తదితర సంగీతపరమైన అప్ డేట్స్ ను అభిమానులకు అందించడానికి ప్లాన్ చేస్తోంది. పాత షోస్ ని కూడా ఇందులో అప్ లోడ్ చేయనుంది. ప్రస్తుతం శృతిహాసన్ క్రాక్ సినిమాతో బిజీగా ఉంది.