సీఎంపై బాక్సర్ సంచలన ఆరోపణలు

స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ కు అర్హత సంపాదించిన ఈ బాక్సర్‌కు అయిదు నెలల కిందట అమరీందర్‌సింగ్‌ ఎన్నో హామీలు ఇచ్చారట. అయితే అవేవీ నెరవేర్చలేదని.. ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది సిమ్రన్‌జిత్‌ కౌర్‌.

అసలు పంజాబ్‌ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్ధికసాయం అందిస్తున్నదో అర్థం కావడం లేదని సిమ్రన్‌ చెప్పుకొచ్చింది. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌.. అప్పుడే అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అవేవి ఇవ్వకపోవడంతో.. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ బ్లాస్ట్ అయింది.