కరోనా బాధని వర్ణించిన సింగర్

కరోనా ఎఫెక్ట్ తో దేశం లాక్‌డౌన్‌ ప్రకటించింది. జనాలు లాక్‌డౌన్‌ ని లైట్ గా తీసుకొంటున్నారు. వారికి ఇటలీలోని పరిస్తితులని వివరీంచే ప్రయత్నం చేసింది. ప్రముఖ గాయని శ్వేతా పండిట్‌. ప్రస్తుతం ఆమె ఇటలీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసింది.

“ఇప్పటికైనా భారతీయులు నిర్లక్ష్యధోరణిని వదిలేసి ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటించాలని, ప్రయాణాలు చేయడం మానేసి ఇంట్లోనే ఉండాలని ఆమె కోరారు. మనకి ఎప్పుడు? ఎలా? వచ్చిందనే విషయాన్ని కూడా తెలుసుకోలేని ఒక రకమైన వ్యాధి కరోనా. మనకి వచ్చింది సాధారణ జలుబా? లేక కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షనా? అనేది కూడా తెలుసుకోలేం. అలా మనం ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించేటప్పటికే.. చాలా ఆలస్యమైపోయింది. ఐసీయూలో పెట్టి ఆక్సిజన్‌ అందిస్తారు. కొన్నిసార్లు అలా ఆస్పత్రిలో చేరిన వ్యక్తి కొన్నిరోజులకే మరణిస్తాడు. ఇది జోక్‌ కాదు. చాలా ప్రమాదకరమైనది” అని వివరించారు.