మరోసారి సల్మాన్ ని టార్గెట్ చేసిన సింగర్

ఇటీవల అమీర్‌ సిద్ధీఖీ సోదరుడు ఫైజల్‌ సిద్దీఖీ చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో తనని వదిలేసిన యువతిపై ప్రతీకారం తీర్చుకునెందుకు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసినట్లు చూపించారు.

ఈ వీడిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ఈ వీడియో మహిళలపై యాసిడ్‌ దాడిని ప్రొత్సహించేల ఉందని, దీనిని తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సింగర్ సోనా స్పందించారు. ”డియర్‌ @aaliznat మునుపుటికీ, ఇప్పటికి మహిళలను కించపరచడం, హింసించడం ఏమాత్రం మారలేదు. అదే మన స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్ ను చూస్తునే ఉన్నాం. ఆయన తన స్నేహితురాళ్ల నుదుటిపై బహిరంగంగా సీసాలు పగలగొట్టిన ఘటనలను పలుమార్లు చుశాం. అయినప్పటికీ ఆయన ఓ పెద్ద హీరో?. ఇది ఇప్పటికైన ఆపడం అవసరం” అంటూ ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు.