శివగామిలో క్వీన్ ని చూశారా ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ‘క్వీన్‌’ ఒకటి. తాజాగా ఈ సిరిస్ టీజర్‌ వచ్చేసింది. గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలితగా కనిపించనున్నారు.

‘క్వీన్‌’ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘స్కూల్‌ డేస్‌లో స్టేట్‌ టాపర్‌, 18 ఏళ్ల వయసుకే స్టార్‌ హీరోయిన్‌, పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రి, మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే ‘క్వీన్‌’ మీకోసం ఎదురుచూస్తుంది. #QueenIsComing’ అని ‘క్వీన్‌’ బృందం ట్వీట్ చేసింది. ఈ నెల 5వ తేదీన ట్రైలర్‌ విడుదల కానుంది.