సుశాంత్ కేసు : మరో ఆరుగురు అరెస్ట్

బాలీవుడ్ డ్రగ్ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్‌ సహా 10 మందిని అరెస్టు చేసింది. తాజాగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. దీంతో డ్రగ్స్‌ కేసులో అరెస్టయినవారి సంఖ్య 16కు చేరింది.

ఆదివారం ముంబయికి చెందిన కరమ్‌జీత్‌సింగ్‌ ఆనంద్‌, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్‌ పటేల్, అంకుష్ అన్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే అన్సారీని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ఆరుగురు మాదకద్రవ్యాల సరఫరాలో భాగం పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే.