బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కవితతో కలిసి సోహెల్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత సోహెల్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోహెల్ ఎక్కడికి వెళ్లిన అతనికి ఘన స్వాగతం లభిస్తుంది. అభిమానులు అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కన్నా సోహెల్ ఎక్కువ ఆదరణ పొందడం విశేషం. ఇక ఇప్పటికే సోహెల్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేయనున్నారు. అంతేకాదు.. గెస్ట్ రోల్ లో మెరవనున్నారు.
Spread the love