రాజస్థాన్’పై హైదరాబాద్ గెలుపు.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం !

గురువారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌(30: 32 బంతుల్లో 2ఫోర్లు), సంజూ శాంసన్‌(36: 26 బంతుల్లో 3ఫోర్లు,సిక్స్‌) రాణించారు.

రాజస్థాన్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మనీష్‌ పాండే(83/47 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8సిక్సులు), విజయ్‌ శంకర్‌(52/51 బంతుల్లో 6 బౌండరీలు) హాఫ్ సెంచరీలతో రాణించారు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్‌, విజయ్‌ చివరి వరకూ క్రీజులో ఉండి జట్టుకు మరిచిపోలేని విజయాన్ని అందించారు. వీరిద్దరూ అజేయంగా 140 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించింది.