హైదరాబాద్-కోల్ కతా మ్యాచ్.. ఎంపైర్ పై నెటిజన్స్ అనుమానాలు !

నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంపైర్ హైలైట్ అయ్యారు. ఆయన మగా ? ఆడా? అని తెలియక నెటిజన్స్ కన్ఫూజన్ అయ్యారు. ఈ మ్యాచ్ ఆన్-ఫీల్డ్ అంపైర్ లలో ఒకరైన ”పస్చిమ్ పాథక్” యొక్క ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే పాథక్ మైదానంలోకి వచ్చిన సమయం నుండి అతని పై వచ్చిన మిమ్స్ తో ట్విట్టర్ నిండిపోయింది. ఇక చాలా మంది పాథక్ హెయిర్ స్టైల్ కారణంగా అతడిని ఫిమేల్ అంపైర్ అనుకున్నారు. కానీ కాదు. అతని మేల్(మగ) అంపైర్. ఇక 2014 నుండి ఐపీఎల్ లో అంపైరింగ్ చేస్తున్న పస్చిమ్ పాథక్ కు ఐపీఎల్ 2020 లో ఇదే మొదటి మ్యాచ్.

ఇక ఈ మ్యాచ్ లో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ కు చివరి బంతికి రెండు పరుగుల కావాల్సిన సమయంలో ఒకే పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది. దాంతో సూపర్ ఓవర్ డ్రామా మొదలయింది. కానీ ఈ సూపర్ ఓవర్ లో సన్‌రైజర్స్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో కోల్‌కత సునాయాసంగా విజయం సాధించింది.