డ్రగ్స్ కేసులో అరెస్టైన క్రికెటర్

శ్రీలంక క్రికెటర్ శేహన్ మధుశంకను డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. రెండు గ్రాముల హెరాయిన్‌తో అతని పోలీసులకు దొరికిపోయాడు. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండగా అతన్ని పన్నాల పోలీసులు అరెస్ట్ చేశారు.

2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేల్లో ఆరంగేట్రం చేసిన మధుశంక తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించి అందరి మన్నలు పొందాడు. రెండు అంతర్జాతీయ టీ-20లు ఆడిన అతన్ని ఆ తర్వాత పక్కనపెట్టారు. అరెస్టైన మధుశంకర్ ని లోకల్ మెజిస్ట్రేట్ రెండు వారాల రిమాండ్‌లో ఉంచాల్సిందిగా ఆదేశించింది.