శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం

పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ మార్చేసి రూ. 3.8కోట్లు కొట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆలయ ఈవో తెలిపారు. కొత్త సాఫ్ట్ వేర్ లో కొన్ని లొసుగులను ఆధారం చేసుకుని లేదా సాఫ్ట్ వేర్ ను మ్యాలిక్యులేట్ చేసి కొంత సమాచారం రాకుండా హైడ్ చేసి అక్రమాలకు పాల్పడినట్టు తేలిందని ఈవో తెలిపారు.

దాదాపు రూ. 4కోట్ల స్కామ్ కి సంబంధించి.. విరాళాల సేకరణలో కోటి రూపాయలకు పైనే కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా అకామిడేషన్ కు సంబంధించి రూ.50 లక్షలకు పైగా కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే అభిషేకం టిక్కెట్లకు సంబంధించి రూ.50 లక్షలు, శీగ్ర దర్శనం టిక్కెట్లకు సంబంధించి కోటి రూ.80 లక్షలు కుంభకోణం చోటుచేసుకున్నట్లు సమాచారమ్.