క్యాపిటల్స్ కెప్టెన్ గాయపడ్డాడు

ఐపీఎల్ 13లో ఢిల్లీ డేర్ డేవిల్స్ దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ జట్టుని అద్భుతంగానడిపిస్తున్నారు. అయితే అయ్యర్ గాయపడ్డాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ భుజం నొప్పితో బాధపడుతున్నాడని ఆ జట్టు తాత్కాలిక సారథి శిఖర్‌ ధావన్‌ తెలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఫీల్డింగ్‌ చేస్తుండగా శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడ్డాడు. తీవ్ర నొప్పితో అతడు మైదానాన్ని వీడటంతో ఢిల్లీ జట్టుకు ధావన్‌ నాయకత్వం వహించాడు.

ఎడమ భుజానికి గాయం కావడంతో అతడు నొప్పితో బాధపడుతున్నాడు. స్కానింగ్‌ రిపోర్టులు వచ్చిన తర్వాత మాత్రమే గాయం తీవ్రత గురించి పూర్తిగా తెలుస్తుందని రాజస్థాన్‌పై 13 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత ధావన్‌ వివరించాడు.అయ్యర్‌కు నొప్పి ఎక్కువగానే ఉంది. మంచి విషయం ఏంటంటే అతడు తన భుజాన్ని అటూ ఇటూ కదిలిస్తున్నాడు. నేను అతనితో ఎక్కువసేపు మాట్లాడలేదు. గాయంపై పూర్తి రిపోర్ట్‌ రావాల్సి ఉందన్నాడు ధావన్.