అమరావతిలో రామాలయానికి సుజనా భారీ విరాళం

ఏపీ రాజధాని అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతి దక్షిణ భారత దేశానికి అయోధ్యవంటిదని ఆయన అన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ సుజనా సంతోషం వ్యక్తం చేశారు.

అమరావతిలో అఖిల భారత హిందూ మహాసభ… అయోధ్య తరహాలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాను. రామాలయం నిర్మాణం వల్ల మన రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతుంది. ఆలయ నిర్మాణానికి నా వంతుగా రూ.10,01,116 విరాళం ప్రకటిస్తున్నానని ప్రకటించారు.