వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీం

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

ఈ కమిటీలో అశోక్ గులాటీ, హర్‌ప్రీత్ సింగ్ మాస్, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ధావంత్ సభ్యులుగా ఉండనున్నారు. రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండు రోజుల పాటు మూడు వ్యవసాయ చట్టాలపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వీటి అమలుపై స్టే విధించింది. తాము నియమించిన కమిటీ ముందుకు వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు రైతు సంఘాలకు సూచించింది.

Spread the love