ఐపీఎల్ 2020 నుంచి సురేష్ రైనా అవుట్.. ఎందుకంటే ?

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ షాక్ తగిలింది. CSK స్టార్ ప్లేయర్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రైనా స్వదేశానికి తిరిగి వెళ్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది.

ఇప్పటికే చెన్నై బృందంలో 12 మందికి కరోనా సోకడంతో ఆజట్టులో కలకలం రేగింది. తాజాగా రైనా తప్పుకోవడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుందని భావిస్తున్నారు. రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని, ఐపీఎల్‌ 2020 సీజన్‌కు అందుబాటులో ఉండడని టీమ్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు.