సూర్యని ఏడిపించిన యువతి

తమిళ్ స్టార్ సూర్య రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోనే. ఆయన సామాజసేవలో ముందుంటారు. ‘అగరం ఫౌండేషన్‌’ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. తన ఫౌండేషన్ ద్వారా సాయం అందుకున్న గాయత్రి అనే బాలిక జీవితగాథను ఆమె మాటల్లోనే విన్న సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సెంగొట్టెయాన్‌ చీఫ్‌, సూర్య గెస్ట్‌లుగా వచ్చారు.

ఈ కార్యక్రమంలో చదువుకోవడానికి పడ్డ కష్టాలను ఓ యువతి భావోద్వేగంతో వివరించింది. నా తండ్రి చనిపోయాక, నేను కూలి పని చేసుకుంటూ నా తల్లికి సహాయపడ్డాను. అప్పుడు హీరో సూర్య నాకు సాయం చేసి ఈ స్థితిలో ఉండటానికి కారణమయ్యారని కన్నీరు పెట్టింది ఆ యువతి. దీంతో సూర్య కూడా వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. వెళ్లి ఆ యువతిని ఓదార్చారు. ఈ సన్నివేశం కార్యక్రమానికి వచ్చిన అందర్నీ కదిలింపజేసింది.