సరిలేరు : సూర్యుడివో చంద్రుడివో సాంగ్ విన్నారా..?

మహేష్ – రష్మిక జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రంలోని ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతున్నారు. ఇప్పటికే మొదటి సాంగ్ శ్రోతలను అలరించగా..తాజాగా సూర్యుడివో చంద్రుడివో అనే మెలోడీ సాంగ్ ను సోమవారం విడుదల చేసారు.

ఈ పాటను ప్రముఖ పంజాబీ సింగ్ బి ప్రాక్ ఆలపించడం విశేషం. ఆయన సౌత్ ఇండియాలో పాడటం ఇదే మొదటిసారి. తన తొలి తెలుగు పాటతోనే ప్రాక్ ఆకట్టుకున్నారు. రామజోగయ్య శాస్త్రి ఎప్పటిలానే మంచి సాహిత్యం అందించి ఆకట్టుకున్నారు. మీరు కూడా ఈ సాంగ్ ను విని ఎంజాయ్ చెయ్యండి.