బీహార్ రాజకీయాల్లో సుశాంత్ ప్రచారం !

ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేలా అంటే ? ఆయన పోస్టర్ల ని బీహార్ భాజాపా వాడుకుంటోంది. దీనిపై  కాంగ్రెస్‌ తప్పుబడుతోంది. నటుడి మృతిని రాజకీయం చేస్తూ, లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తోంది.

దీనిపై తాజాగా  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించారు. సుశాంత్‌ మృతి ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, అతడికి న్యాయం జరిగేంతవరకూ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘సుశాంత్‌ మరణాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. సుశాంత్‌ మరణం కంటే ముందు నుంచే బిహార్‌లో పార్టీ కోసం పనిచేస్తున్నా. నటుడి మృతి సామాన్య ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. అతడికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటాం. ఆ ఘనటను మేం మర్చిపోం. ఇంకెవ్వరినీ మర్చిపోనివ్వం’ అని అన్నారు.