బిగ్ బ్రేకింగ్ : సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

2020లో అన్నీ దారుణాలే. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు సినీ ప్రముఖులు మృత్యువాతపడుతున్నారు. ‘ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎం.ఎస్‌.ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంతో ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలతో రాణిస్తున్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం బాలీవుడ్ ని ఉలిక్కిపడేలా చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయని పోలీసులు తెలిపారు.