సోదరితో సుశాంత్ చేసిన ఆఖరి వాట్సాప్ చాట్ ఏముందంటే ?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆఖరి సారి తన సోదరి శ్వేతాతో చేసిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో శ్వేతా సుశాంత్ ని అమెరికా రావాల్సిందిగా కోరింది. ఇక్కడ ఓ నెలపాటు జాలిగా ఎంజాయ్ చేద్దామని కోరింది.

2007లో నాకు వివాహం అయింది. నేను అత్తారింటికి వెళ్లేటప్పుడు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. ఆ తర్వాత నేను అమెరికా వచ్చేశా. తనూ బిజీ అయిపోయాడు. మమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఎప్పుడు మాట్లాడుకున్నా, అమెరికా రమ్మన్ని అడుగుతూ ఉండేదాన్ని. ఇప్పటికీ తను నా కళ్లముందే కదలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా ఒక పీడకలలా అనిపిస్తోంది” అని శ్వేత ఓ ఇంటర్ప్యూలో చెప్పుకొచ్చారు.