స్వామి ప్రబోధానంద కన్నుమూత

అథ్యాత్మిక గురువు స్వామి ప్రబోధానంద కన్నుమూశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఈ సిద్ధాంతం.

1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. అనంతరం ఆథ్యాత్మిక గురువుగా మారారు.

Spread the love