ఎస్వీబీసీ కొత్త చైర్మన్’గా జర్నలిస్ట్ స్వప్న

ఆడియో టేపుల వ్యవహారంలో నటుడు పృధ్వీరాజ్ ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పోగొట్టుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ కొత్త చైర్ పర్సన్ ఎవరు ? అనే దానిపై చర్చ మొదలైంది. నటుడు పోసాని కృష్ణమురళీ, జర్నలిస్ట్ స్పప్న పేర్లు తెరపైకి వచ్చాయ్. స్వప్నను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వప్న ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆమెనే చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇక పృధ్వీపై లంచాలు తీసుకొని కొందరికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆయన ఓ మహిళా ఉద్యోగితో ఫోన్ లో శృంగార సంభాషణలు చేసినట్టు ఆడియో కలకలం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు.