సుప్రీంకు స్వర్ణప్యాలెస్ ఘటన

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రమేశ్ ఆస్పత్రి అధినేత రమేష్ బాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై గత మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. డాక్టర్ రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదన్న ఈ సందర్భంగా ప్రశ్నించింది.