ఎమర్జెన్సీపై తెలంగాణ భాజాపా వీడియో కాన్ఫరెన్స్

1975 జూన్ 25న ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ బ్లాక్‌డే నిర్వహించాలని తెలంగాణ భాజాపా నిర్ణయించింది. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించబోతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.

సామాజిక , రాజకీయ నేతలను జైళ్లలో బంధించి పౌర హక్కులను హరింపజేసిన విషయాలను నేటి తరాలకు గుర్తుచేసేందుకు బీజేపీ జూమ్ అప్ ద్వారా సభలను నిర్వహిస్తోంది. జూమ్‌అప్ ద్వారా 5.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.