ప్రవేశ పరీక్షలు వాయిదా వేయండి : ఉత్తమ్

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలంటూ శుక్రవారం గాంధీ భవన్‌ నుంచి అబిడ్స్‌ జీపీవో వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ గాంధీభవన్‌ ఆవరణలోనే నేతలు ధర్నాకు దిగారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టకొని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.