టీ20 వరల్డ్ కప్ వాయిదా ?

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్‌ వాయిదా, ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు.

ప్రపంచకప్‌ నిర్వహణకు క్రికెట్‌ ఆస్ట్రేలియా అనుకూలంగా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో ప్రపంచకప్‌ నిర్వహిస్తే బాగుంటుందన్నది క్రికెట్‌ ఆస్ట్రేలియా అభిమతంగా తెలుస్తోంది. ప్రపంచకప్‌ వాయిదా పడితే మాత్రం అక్టోబర్‌-నవంబర్‌ విండోలో ఐపీఎల్‌-2020 నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.

Spread the love