టీ20 వరల్డ్ కప్ ఆడబోయే భారతజట్టు ఇదే !

ఆస్ట్రేలియా వేదికగా మహిళా వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21 నుంచి వరల్డ్ కప్ ఆరంభం కానుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం టీ20 మహిళా జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. స్టార్‌ ప్లేయర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. 15 మంది సభ్యుల జట్టులో బెంగాల్‌ బ్యాట్స్‌విమన్‌ రిచా హోష్‌ మాత్రమే కొత్త ప్లేయర్‌ కావడం విశేషం.

ఇటీవల జరిగిన విమెన్స్‌ ఛాలెంజర్‌ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన రిచా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న 15ఏండ్ల స్కూల్‌ గర్ల్‌ షఫాలీ వర్మ కూడా తొలిసారి మెగా ఈవెంట్‌లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది.