‘టక్కర్’ టైటిల్ పోస్టర్ ని వదిలిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వివైధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొంటున్నారు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో విజయాలు అందుకొన్నారు. సినిమా సినిమాకి క్రేజ్ పెంచుకొంటు వెళ్తున్నారు. మెగా హీరోల దారిలో వెళ్లకపోవడం, తనకంటూ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడం వరుణ్ ప్రత్యేకత.

తాజాగా సిద్ధార్ సినిమా టక్కర్ పోస్టర్ ని వరుణ్ తేజ్ విడుదల చేశారు. కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమిది. అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలు. సినిమా షూటింగ్ పూర్తయింది. 2020 ఫిబ్రవరిలో టక్కర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.