అయోమయంలో తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా అయోమయంలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా తమ్మూనే చెప్పింది. కాదు.. రాసుకుంది. తమన్నాకి కవితలు రాయడం అలవాటు. చిన్నతనంలో బాగా రాసేదట. హీరోయిన్ గా బిజీ అయ్యాక తగ్గించేసింది. అయితే కరోనా లాక్డౌన్ తో దొరికిన ఈ ఖాళీ సమయంలో కొన్ని కవితలు రాసింది.

‘ఈ లాక్‌డౌన్‌ విరామంలోనూ కొన్ని కవితలు రాశాను. వాటి కన్నా ఎక్కువగా నా చిన్నతనంలో రాసుకున్న పాత కవితల్ని తిరిగి చదువుకుంటున్నా. కొన్నింటిని చదువుతుంటే.. ఆ టైమ్ లో ఎందుకిలా రాశా? ఇది కూడా ఒక కవితేనా? అని తెగ నవ్వొస్తొంది’ తమ్మూ చెప్పుకొచ్చింది. ఇంతకీ తమ్మూ తన డైరీలో ఎక్కువ సార్లు రాసుకున్న మాటేంటో తెలుసా.. ? ‘నేను చాలా అయోమయంలో ఉన్నా.. !!