నాయిని మృతిపై గవర్నర్ తమిళిసై సంతాపం

తెలంగాణ హోంశాఖ మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు జూబ్లీహిల్స్‌లోని అపోలో అసుపత్రి వర్గాలు ప్రకటించాయి. నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల  గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతాపం ప్రకటించారు.

నాయిని కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయిని చివరి శ్వాస వరకు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేశారని గవర్నర్ కొనియాడారు. తెలంగాణ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తమిళిసై పేర్కొన్నారు.