ప్రియాంకరెడ్డి ఇంటికి చేరుకున్న గవర్నర్

హైదరాబాద్ నగర పరిధిలోని షాద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. చటాన్ పల్లి వంతెన వద్ద ప్రియాంకరెడ్డి (22) అనే వెటర్నరి వైద్యురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులకి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై  సౌందర రాజన్ ప్రియాంకరెడ్డి ఇంటికి వెళ్లారు. కాసేపట్లో కుటుంబ సభ్యులను గవర్నర్‌ పరామర్శించనున్నారు. ఇప్పటికే వైద్యురాలి ఇంటికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు చేరుకుని పరామర్శిస్తున్నారు. మరోవైపు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులని తమకి అప్పగించాలని ప్రజా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.