ఉపాధ్యాయులు సహజ వాస్తు శిల్పులు

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉపాధ్యాయుల గురించి గొప్పగా చెప్పారు. ఉపాధ్యాయులు సమాజానికి వాస్తు శిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదన్నారు. సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు.

దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాకుండా తత్వవేత్తగా, రచయితగా భారత దేశానికి సేవలు అందించారన్నారు.