టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు ? 

కరోనా ఎఫెక్ట్ తో క్రీడా టోర్నీలన్ని రద్దయ్యాయ్. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అక్టోబర్ లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆగస్టులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళవచ్చని వార్తలు రావడం విశేషం.

కరోనా వైరస్ కారణంగా శ్రీలంకతో వన్డే, టి 20 సిరీస్ లను క్రికెట్ దక్షిణాఫ్రికా వాయిదా వేసింది, కానీ భారత్‌తో సిరీస్ ఆడటానికి దక్షిణాఫ్రికా  ఆసక్తి కనబరుస్తోంది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు బిసిసిఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, దీనిపై గ్రేమ్ స్మిత్ మాట్లాడారు.

‘మేము బీసీసీఐతో ఎలా మాట్లాడుతున్నాం. టీ 20 సిరీస్ ఆడటానికి దక్షిణాఫ్రికాకు వస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు చివరి వరకు వాతావరణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాని భౌతిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాళీ స్టేడియంలో సిరీస్‌ను ఆడవచ్చు’ అన్నారు.