ఓయూలో ఉద్రిక్తత

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఉస్మానియా యూనివర్శిటీ సందర్శన ఉద్రిక్తగా మారింది. ఓయూలో కబ్జా అయిన భూములని చూసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. పోలీసులతో వి.హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఓయూ భూములను రక్షించాలని ఫిటిషన్ ఇచ్చిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాప్‌పై కేసులు బుక్ చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. కబ్జా చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించి, నిర్మాణాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన విమర్శించారు. ఓయూని డెడ్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.