TS ఐసెట్ దరఖాస్తుల గడువు పెంపు

కరోనా లాక్ డౌన్ విద్యాసంస్థలు మూడపడ్డాయి. పరీక్షలు రద్దయ్యాయ్. అయితే మూడో విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో పరీక్షలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌-2020 దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించారు.

ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి ప్రకటించారు. కొవిడ్‌-19 దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు గడువును పొడిగించామని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, అభ్యర్థులు తమకు ఇష్టం వచ్చిన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే పరీక్ష తేదీని తెలియజేస్తామని తెలిపారు.