తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టానికి శాసనసభ ఆమోదం

కొత్త రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుని ముజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. ఈ నెల 9వ తేదీన సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. సభ్యులందరూ అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్ 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం 2020 సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.