ఆత్మహుతి దాడిలో.. 8 మంది ఆర్మీ సైనికులు మృతి

ఆప్ఘనిస్థాన్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌ మైదాన్‌ వార్దాక్‌లో తాలిబన్లు జరిపిన కారుబాంబు ఆత్మహుతి దాడిలో 8 మంది ఆప్ఘన్‌ జాతీయ ఆర్మీ సైనికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

కాబూల్‌కు పశ్చిమ దిశలోని సయీద్ అబాద్ జిల్లాలో సైనికుల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు సైనికాధికారులు తెలిపారు. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పౌరులపై ఆఫ్ఘన్ సైనికులు జరుపుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే దాడికి పాల్పడినట్లు వారు తెలిపారు.