హైదరాబాద్ ఆటగాడికి తెవాటియా వార్నింగ్

దుబయ్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఆసక్తికర ఘటన జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఖలీల్ అహ్మద్, రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉండగా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. రియాన్ పరాగ్ మొదటి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి ఒక పరుగు చేశాడు. మూడో బంతికి తెవాటియా రెండు రన్స్ సాధించాడు. నాలుగో బంతికి సింగిల్ తీసి నాన్ స్ట్రైకింగ్ వెళ్లిన తెవాటియా.. ఖలీల్‌తో గొడవ పడ్డాడు. ఖలీల్ ఏదో అభ్యంతర వ్యాఖ్య చేయడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు.