ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

ఢిల్లీ పోలీసులు భారీ కుట్రని భగ్నం చేశారు. ఐఎస్ఐఎస్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఐసిస్ నిందితులను దేశ రాజధానిలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడు పోలీసులు ఓ జిహాదీ ఉగ్రవాద ముఠాను పట్టుకున్న రోజే ఢిల్లీ పోలీసులకు మరో ముగ్గురు ఉగ్రవాదులు చిక్కడం గమనార్హం. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ఉగ్రవాదుల చొరబాటు గురించి నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. నేపాల్ సరిహద్దు ద్వారా 5గురు అనుమానితులు భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు ఐబీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.