నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం !

నివర్ తుఫాన్ దూసుకెళ్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం తీవ్రవాయుగుండం.. ప్రస్తుతం తుఫానుగా మారింది. బుధవారం సాయంత్రానికి పుదుచ్చేరి, తమిళనాడు సరిహద్దులోని కరైకాల్‌, మామల్లాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి సెలవు ప్రకటించారు.

ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. గంటకు 120 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రత్తమై సెలవు ప్రకటించింది.

Spread the love