కంటైన్మెంట్ జోన్ తిరుమల

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తిరుమల తిరుపతిలోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలను ‘కంటైన్మెంట్ జోన్’ గా ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కంటోన్మెంట్ జోన్ అయినా… తిరుమల శ్రీవారి దేవాస్థానం తెరచే ఉండనుంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని మర్చి 22 నుంచి నిలిపేసిన విషయం విదితమే. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత తిరిగి దర్శనానికి అనుమతినిచ్చారు. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తులకు మాత్రమే అనుమతినిచ్చిన బోర్డు.. ప్రస్తుతం 12,000 మంది భక్తులకు అనుమతినిచ్చింది.

Spread the love