ఏప్రిల్ 7న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ?

ఈ యేడాది తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర శాసనసభ పదవీకాలం వచ్చే మే 24తో ముగియనుంది. ఆ లోపున 16వ శాసనసభకు ఎన్నికలను ముగించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 24న ఫలితాలు వెలువరించనున్నారని తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అతి త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని తెలుస్తోంది.

Spread the love