కరోనా ఎఫెక్ట్.. టోల్ ఫీజు రద్దు !

కరోనా వైరస్ ప్రభావితం చేయని రంగం లేదు. అన్నీ రంగాలని అతలాకుతలం చేస్తోంది.. ఈ మహమ్మారి. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 14 వరకూ ఫీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో సిటీల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా జామ్ అవుతోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం టోల్ గేటు ఫీజు రద్దు చేసింది. ఏప్రిల్ 14న వరకూ లాక్ డౌట్ ప్రకటించినా… కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరి సోకే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పోరాటం చేస్తోంది.