ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెంపు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ చిత్రంలో ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేసిన ఏపీసోడ్ ఆకట్టుకొంది. ఫైన్స్ ని పెంచితే ప్రజల్లో భయం ఏర్పడుతుంది. అప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తారు. ట్రాఫిక్ సమస్య ఉండదనే పాయింట్ ని దర్శకుడు కొరటాల చెప్పారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పాయింట్ యూపీ ప్రభుత్వం ఫాలో అవుతోంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేసింది. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చెల్లించాల్సిన జరిమానాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీనికి సంబంధించిన బిల్లుకు జూన్‌లో ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్త ట్రాఫిక్ జరిమానాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడితే రూ. 10వేల జరిమానా విధించనున్నారు.