పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలో మీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయ్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్తగూడెం వద్ద వంతెన దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి మరమ్మతులు చేస్తున్న కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో కొత్తగూడెం నుంచి తూప్రాన్‌ పేట వరకు వాహనాలు బారులుదీరాయి.

దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నాలుగురోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారిపై ఇనాంగూడ వద్ద భారీగా వరద నీరు ప్రవహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.