ట్రాయ్ కొత యాప్ విడుదల

ట్రాయ్ సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. దీనివలన మనం చూడాలనుకున్న ఛానళ్ళను ఎంపిక చేసుకోవడం ద్వారా బిల్లును తగ్గించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలనుకుంటున్న ఛానెళ్లను సెలెక్ట్ చేసుకుంటే ఎంత బిల్ అవుతుందో సులువుగా తెలుసుకోవచ్చు.

టాటాస్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, డీ2హెచ్, హాత్‌వే డిజిటల్, సిటీ నెట్వర్క్‌, ఏషియానెట్, ఇన్‌డిజిటల్ వంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్‌ఓలకు సంబంధించిన అన్ని వివరాలూ ఉంటాయి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. తర్వాత… సబ్‌స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత… సదరు మొబైల్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మాడిఫై చేయొచ్చు.