హాటు కేకుల్లా రైల్వే టికెట్లు

దాదాపు రెండు నెలల తర్వాత పాసింజర్ రైళ్లు కూతపెట్టనున్నాయి. కొన్ని నిబంధనలతో దాదాపు 200 రైళ్లని నడపబోతుంది రైల్వేశాఖ. జూన్ 1 నుంచి రైళ్ల రాకపోకలు మొదలు కానున్నాయి. ఈరోజు నుంచే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయ్. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. బుకింగ్‌ ప్రారంభించిన రెండు గంటల్లోనే 1.50 లక్షల టికెట్లు విక్రయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 100 జతల రైళ్లకు గానూ (200 రైళ్లు) మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 73 రైళ్లకు మాత్రమే టికెట్లు మిగిలాయని రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇక జూన్ 1 నుంచి నడవనున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయ్.. ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02701/02), హావ్‌డా- సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (02703/04), హైదరాబాద్‌- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (02723/24), దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791/92), విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (02805/06), గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (07201/02) , తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (02793/94), హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (02727/28).