ఆగస్టు వరకు రైల్ కూతల్లేవ్ !

రెండో విడత కరోనా లాక్‌డౌన్ లో భాగంగా.. భారతీయ రైల్వే ఏప్రిల్‌ 15 నుంచి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రారంభమైన సందర్భంగా అన్ని రైలు సర్వీసులను నిలిపివేసింది. ఆయా రైళ్లకు చెందిన రిజర్వేషన్లను కూడా ఈ శాఖ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 నుంచి 120 రోజుల అనంతరం ప్రయాణించేందుకు ఉద్దేశించిన అన్ని టికెట్లకుగాను ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు వరకూ రైల్ కూత వినపడే సూచనలు ఏమాత్రం లేవని తెలుస్తోంది. పూర్తి నిబంధనలతో దేశీయ విమానాల రాకపోకలకు అనుమతులు లభించినా… రైళ్లకు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకూ అనుమతులు లభించనట్లు సమాచారం. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్లను ప్రత్యేక రైళ్లుగా గుర్తిస్తామని, అంతేకాకుండా 230 మెయిల్స్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నడుస్తున్నాయని రైల్వేశాఖ తెలిపింది.